వి : రక్షకుడు, రాక్షసుడు రాబోతున్నారట

యంగ్‌ హీరో నాని 25వ చిత్రంలో హీరోగా కాకుండా విలన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.

వి అనే చిత్రంకు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా సుధీర్‌ బాబు హీరోగా కనిపించబోతున్నాడు.

ఈ చిత్రంలో విలన్‌ పాత్రను నాని చేస్తున్నాడు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇక ఈ చిత్రం ఫస్ట్‌ లుక్స్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.ఈ నెల 27వ తారీకున రక్షకుడు ఫస్ట్‌లుక్‌ రాబోతుంది అన్నారు.

సుధీర్‌ బాబు తాను రక్షకుడిగా మీ ముందుకు రాబోతున్నాను అంటూ ట్వీట్‌ చేశాడు.ఇక 28వ తారీకును రాక్షసుడు ఫస్ట్‌ లుక్‌ అంటే నాని ఫస్ట్‌లుక్‌ రాబోతుంది.

Advertisement

ఈ చిత్రంలో సుధీర్‌బాబు పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు.నాని మాత్రం విలన్‌గా కనిపించే అవకాశాలు ఉన్నాయి.

ఫస్ట్‌లుక్స్‌ ఎలా ఉంటాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటి వరకు హీరోగా మాత్రమే నానిని చూశాం.

వి చిత్రంలో మొదటి సారి విలన్‌గా చూడబోతున్నాం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 15 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు