విహారయాత్ర కోసం యూఏఈ వెళ్లిన భారత వ్యాపారవేత్త గుండెపోటుతో మరణించారు.భారత్‌లోని వివిధ ప్రాంతాలలో ఉన్న జైన సమాజానికి చెందిన 18 మంది సభ్యుల బృందం ఈ నెల 2న దుబాయ్‌కు వెళ్లింది.
వీరిలో పంజాబ్‌కు చెందిన 61 ఏళ్ల నేమ్ చంద్ జైన్ తన భార్యతో పాటు వెళ్లారు.

ఈ క్రమంలో ఆయన ఆదివారం మధ్యాహ్నం తను బస చేసిన హోటల్‌లో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతుండగా ఇబ్బందిగా అనిపించింది.వెంటనే నేమ్ చంద్ స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చి భార్యకు విషయం చెప్పాడు.దీంతో ఆమె తనతో పాటు గదికి వచ్చి టీ తాగి విశ్రాంతి తీసుకోమని చెప్పింది.
కానీ ఆయన పైకి వెళ్లలేకపోయాడు.మెట్లు ఎక్కుతుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు ట్రిప్ మేనేజర్ సునీల్ జైన్ తెలిపారు.
అంబులెన్స్ సైతం 10-15 నిమిషాలలోనే హోటల్‌కు చేరుకుంది.అయినప్పటికీ నేమ్‌చంద్‌ను రక్షించలేకపోయామని సునీల్ ఆవేదన వ్యక్తం చేశారు.
నేమ్‌చంద్‌కు ఇది మొదటి విదేశీ పర్యటన, దుబాయ్ వాతావరణాన్ని ఎంతగానో ఇష్టపడిన ఆయన ఇక్కడే స్థిరపడాలని భావించారు.బుధవారం ఆయన 62వ పుట్టినరోజు.ఈరోజునే నేమ్‌చంద్ మృతదేహం భారతదేశానికి రానుండటం విషాదకరం.







