ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదం కారణంగా 169 మంది మృతి చెందినట్లు సమాచారం.
ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ఉక్రెయిన్ అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ సంబందించిన బోయింగ్ 737 విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.దీనితో ఆ సమయంలో 169 మంది సిబ్బంది,ప్రయాణికులు విమానం లో ఉండడం తో అంతా కూడా మృతి చెందినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.
స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.తెల్లవారు జామున బయలుదేరిన విమానం కొద్దీ క్షణాల్లోనే రాడార్ తో సంబంధాలు తెగిపోయాయని, ఆ వెంటనే విమానం కూలిపోయినట్లు అక్కడి మీడియా కధనాలు తెలిపాయి.

సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగినట్లు మీడియా పేర్కొంది.విమానం కూలిన దృశ్యాలను కొందరు నెటిజన్లు సోషల్ మీడియా లో కూడా పోస్ట్ చేసారు.అయితే విమాన ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది.మరోపక్క ఈ ప్రమాదం పై బోయింగ్ సంస్థ కూడా స్పందించింది.ఇరాన్ మీడియా కధనాలు ద్వారా ప్రమాదం గురించి తెలుసుకున్నామని, ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.ఇరాక్ లోని అమెరికా స్థావరాల పై ఇరాన్ క్షిపణి దాడులు చేసిన కొద్దీ గంటల వ్యవధిలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ఈ విమానాన్ని ఇరాన్ గగన తల రక్షణ వ్యవస్థ ప్రమాదవశాత్తు కూల్చి ఉండవొచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.







