తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం దర్బార్ ప్రస్తుతం తమిళ జనాలకు కునుకు లేకుండా చేస్తోంది.స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్‌లకు కేరాఫ్‌గా నిలుస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
కాగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో రజినీ ఈ సినిమాలో మరో లెవెల్‌లో రెచ్చిపోయి నటించినట్లు చిత్ర యూనిట్ తెలిపారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ఇన్‌సైడ్ టాక్ బయటకు వచ్చింది.
ఈ సినిమాను చూసిన చిత్ర వర్గాలు రజినీకాంత్ ఫ్యాన్స్ ఎలాంటి సినిమానైతే ఆశిస్తున్నారో అదే ఈ సినిమా అని వారు అన్నారు.ఇక ఈ సినిమాలో రజినీ నోట వచ్చే డైలాగులు, పంచ్‌లు థియేటర్లలో ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిస్తాయి.
ఇక పోలీస్ ఆఫీసర్‌గా తలైవా యాక్షన్‌కు జనాలు ఫిదా కావడం ఖాయమని అంటున్నారు సినీ జనం.అయితే ఈ సినిమా కథ చాలా రొటీన్‌గా ఉందని, మురుగదాస్ తనదైన స్క్రీన్‌ప్లేతో సినిమాను ఆసక్తికరంగా మాలిచాడని తెలుస్తుంది.
కాగా అనిరుధ్ అందించిన మ్యూజిక్ సినిమాకు బాగా కలిసొచ్చిందని, ముఖ్యంగా రజినీకాంత్ ఎలివేషన్ సీన్స్‌లో గూస్‌బంప్స్ తెప్పిస్తాయని తెలుస్తోంది.అయితే సాధారణ ప్రేక్షకులకు ఈ సినిమా అంతస్థాయిలో అలరించలేకపోవచ్చని తెలుస్తోంది.
ఏదేమైనా ఈ సినిమాతో మరోసారి తలైవా తనదైన సత్తా చాటడం మాత్రం ఖాయమని అంటున్నారు అభిమానులు.జనవరి 9న రిలీజ్ కానున్న ఈ దర్బార్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.







