సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మహేష్ బాబు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని అనీల్ రావిపూడి తెరకెక్కించాడు.
ఈయన గత చిత్రాలు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగాయి.అందుకే సరిలేరు నీకెవ్వరు కూడా తప్పకుండా మంచి హిట్ అవుతుందని అంతా నమ్ముతున్నారు.
ఇక మహేష్ తదుపరి చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్నాడు.మహేష్ 25వ చిత్రానికి వంశీ దర్శకత్వం వహించాడు.
ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.అందుకే వెంటనే తన 27వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చాడు.

మహేష్ బాబు 27వ చిత్రం సమ్మర్‌లో పట్టాలెక్కే అవకాశం ఉంది.ఇక ఇదే ఏడాది చివర్లో మహేష్ 28వ సినిమా కూడా ప్రారంభం అవుతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.ఆ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తాడంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఈరోజుల్లో వంటి బూతు చిత్రంతో దర్శకుడిగా మారిన మారుతి ఆ తర్వాత తర్వాత ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా మారిపోయాడు.
ప్రతి రోజు పండుగే చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన మారుతి ప్రస్తుతం మహేష్ బాబు కోసం స్క్రిప్ట్ తయారు చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.

మీడియాలో వస్తున్న ఈ వార్తలు మహేష్ బాబు ఫ్యాన్స్‌కు టెన్షన్ పెడుతున్నాయి.మారుతి ఒక చిన్న చిత్రాల దర్శకుడు అలాంటి మారుతితో మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ సినిమా చేయండం ఏంటీ అంటూ వారు ఆందోళన చెందుతున్నారు.మరీ చిల్లరగా ఈ కాంబో ఉందని మహేష్ స్థాయికి ఇంకా మారుతి చేరుకోలేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఇంకా ఈ కాంబో గురించి అయితే అధికారిక ప్రకటన రాలేదు.మహేష్ మారుతికి ఓకే చెప్పాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.







