గతంలో తమిళ స్టార్ హీరో ధనుష్ తమ కొడుకే అంటూ ఓ వృద్ధ దంపతులు కోర్టును ఆశ్రయించిన విషయం అందరికీ తెలిసిందే.అటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, నటుడు శోభన్ బాబులు తన తల్లిదండ్రులు అంటూ ఓ యువతి కోర్టుకెక్కిన సంగతి కూడా అందరికీ తెలిసిందే.
తాజాగా ఇలాంటి ఘటన బాలీవుడ్‌లో చోటు చేసుకుంది.
ప్రముఖ సింగర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత అనురాధ పౌడ్వాల్ తన కన్న తల్లి అంటూ కర్మ మోదెక్స్(45) అనే మహిళ కోర్టుకెక్కింది.
తను పుట్టిన నాలుగు రోజులకే తనను పొన్నచ్చన్ అనే వ్యక్తికి ఇచ్చి వదలివెళ్లారని ఆమె ఆరోపిస్తూ తిరువనంతపురం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.అనురాధ, అరుణ్ దంపతులు తనను కన్నారని పొన్నచ్చన్ చనిపోయే ముందుకు తనకు చెప్పారంటోంది ఆ మహిళ.
కాగా పొన్నచ్చన్ భార్య మతిస్థిమితం తప్పిందని, అతడికి ముగ్గురు సంతానం ఉండగా నాలుగో సంతానంగా తనను పెంచుకున్నారని చెబుతోంది.

కోర్టు తనకు రూ.50 కోట్ల పరిహారం ఇప్పించాలని, దీనికి ఆమె ఒప్పుకోకపోతే డీఎన్ఏ టెస్టుకు కూడా నేను రెడీ అంటోంది కర్మ మోదెక్స్.ఏదేమైనా ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
దీంతో అనురాధ పౌడ్వాల్ దంపతులు తలపట్టుకున్నట్లు తెలుస్తోంది.మరి ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.







