నితిన్, రష్మికలకు థాంక్స్ చెప్పిన హృతిక్.... ఎందుకో తెలుసా....?

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ టాలీవుడ్ హీరో నితిన్ మరియు రశ్మిక మందన్న లకి థాంక్స్ చెబుతూ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా  భీష్మ చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు తెలియజేశాడు.

అయితే ఇక్కడ మీకు బాలీవుడ్ హీరో ఎందుకు నితిన్ కి థాంక్స్ చెప్పాడు అని సందేహం రావచ్చు.

అందుకు గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రస్తుతం కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నితిన్ సరసన భీష్మ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రం  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.అంతేగాక ఇప్పటికే ఈ చిత్రం నుంచి సింగిల్స్ యాంతం అనే పేరుతో లిరికల్ సాంగ్ విడుదల అయ్యి మంచి ప్రేక్షకాదరణ పొందింది.

అయితే ఇదిలా ఉండగా తాజాగా నితిన్, రష్మిక మందన్నలు షూటింగ్ లో పాల్గొన్న సమయంలో  వార్ సినిమాలోని గంగ్రూ అనే పాటకి డాన్స్ చేశారు.అంతేగాక ఈ డాన్స్ కు సంబంధించిన వీడియోని రష్మిక మందన్న తన సోషల్ మీడియా కాతాలో పోస్ట్ చేశారు.

Advertisement

అంతేగాక ఈ వీడియోలో వారు చేసిన పర్ఫామెన్స్ హృతిక్ రోషన్ కి అంకితం కూడా పెట్టింది.దాంతో  హృతిక్ రోషన్ స్పందిస్తూ ఈ విధంగా స్పందించాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో బాగానే వైరల్ అవుతోంది.

అయితే ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం లో ఫిబ్రవరి నెలలో విడుదల చేసేందుకు దర్శకుడు వెంకీ కుడుముల ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు