హిట్ ఇచ్చినా గుర్తింపు రాని డైరెక్టర్.. ఫీలవుతున్నాడట!

ప్రస్తుతం ఇండస్ట్రీలో సక్సెస్ కొడితేనే గుర్తింపు వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే.ఇది నటీనటుల దగ్గరనుంచి టెక్నికల్ టీమ్ వరకు వర్తిస్తుంది.

అయితే రెండు పెద్ద హిట్ సినిమాలు ఇచ్చినా కూడా కనీసం ఆ దర్శకుడికి గుర్తింపు కూడా రావడం లేదు.ఇంతకీ ఆ దర్శకుడు ఎవరని అనుకుంటున్నారా? యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు జై లవకుశ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించి, రీసెంట్‌గా వెంకటేష్, నాగచైతన్యలకు వెంకీ మామ సినిమాతో అదిరిపోయే హిట్ అందించిన దర్శకుడు బాబీ తనకు తగిన గుర్తింపు రాకపోవడంపై అసంతృప్తిగా ఉన్నాడట.అటు జైలవకుశ చిత్రం హిట్ అయినప్పుడు కూడా క్రెడిట్ మొత్తం తారక్‌కే వెళ్లిపోవడం, ఇప్పుడు వెంకీ మామ చిత్ర సక్సెస్ క్రెడిట్‌ను వెంకటేష్, నాగచైతన్యలు కొట్టేయడంతో బాబీ చాలా ఫీలయ్యాడని తెలుస్తోంది.

ఏదేమైనా సినిమాను సక్సెస్ చేసే విషయంలో దర్శకుడి పాత్ర చాలా కీలకమని స్టార్లతో పాటు ఆడియెన్స్‌ కూడా గుర్తించాలి.ఇలా గుర్తించినప్పుడే టెక్నికల్ వాళ్లు రెట్టింపు ఉత్సాహంతో తమ నెక్ట్స్ సినిమాలకు పనిచేయగలరని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఏదేమైనా వెంకీ మామ సక్సెస్‌లో బాబీ పాత్రను గుర్తించకపోవడం నిజంగా దారుణమనే చెప్పాలి.

Advertisement
సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!

తాజా వార్తలు