గూగుల్ గూబ గుయ్యిమనిపించిన కోర్టు

ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.యాడ్స్ విషయంలో వివక్ష చూపించడం, రూల్స్ అతిక్రమించడంతో గూగుల్‌కు ఫ్రాన్స్‌ కోర్టు భారీ జరిమానా విధించింది.

 Google Fined Huge By France Court-TeluguStop.com

గూగుల్ ప్రకటనల విషయంలో తమకు ఇష్టానుసారంగా ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తుందని వచ్చిన ఫిర్యాదుపై ఫ్రాన్స్ కోర్టు విచారణ చేపట్టింది.

ఈ ఫిర్యాదు నిజం అని నిరూపణ కావడంతో గూగుల్‌కు భారీ జరిమానా పడింది.

గూగుల్‌లో యాడ్స్ ఇచ్చేవారికి ఒకే విధమైన నిబంధనలు పాటించాలి.కానీ ఈ విషయంలో గూగుల్ తన ఇష్టానుసారంగా ఆధిపత్య ధోరణితో వ్యవహరించి, పక్షపాతం చూపిందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఇప్పటికే ఈ కేసులో అమెరికా తదితర దేశాలు గూగుల్‌కు భారీ మూల్యం జరిమానాగా విధించాయి.కాగా తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన అధికార సంస్థ కూడా గూగుల్‌కు ఏకంగా రూ.1,180 కోట్ల భారీ జరిమానా విధించింది.

ఇంటర్నెట్ రంగంలో నెంబర్‌ వన్‌గా దూసుకుపోతున్న గూగుల్ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు అంటున్నారు టెక్ ఎక్స్‌పర్ట్స్.

ఏదేమైనా గూగుల్ చేసిన పనికి తగిన మూల్యం చెల్లించుకుందని పలువురు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube