పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడనే వార్త ప్రస్తుతం అభిమానులకు సంతోషం కంటే కూడా ఎక్కువగా ఆందోళనను కలిగిస్తోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది.
అయితే పవన్ ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
కాగా పవన్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన పనులు ఇప్పటికే ఫుల్ స్పీడులో జరుగుతున్నాయి.ఈ సినిమాలో హీరోయిన్లుగా ఇప్పటికే నివేదా థామస్, అంజలిని ఎంపికచేసిన చిత్ర యూనిట్ మూడో హీరోయిన్‌గా మల్లేశం ఫేం అనన్యను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.ఏదేమైనా పవన్ లాంటి స్టార్ హీరోతో యాక్ట్ చేసే అవకాశం వచ్చినందుకు అనన్య మాత్రం ఫుల్ హ్యాపీగా ఉందని తెలుస్తోంది.దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు.