అమరావతిలో పర్యటించేందుకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనపై నిరసనలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే.ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు చెప్పులు విసరడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
అయితే చెప్పులు విసిరింది.వైసీపీ కార్యకర్తలే అంటూ టీడీపీ ఆరోపణలు చేయగా దాన్ని వైసీపీ ఖండించింది.
ఈ ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ విచారించారు.అసలు చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులు విసిరింది ఎవరు అనే విషయాన్ని ఆయన వివరించారు.
చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులతో, రాళ్లతో దాడి చేసిన ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని డీజీపీ చెప్పారు.చెప్పులు విసిరిన వ్యక్తి రైతు అని రాళ్లు విసిరిన వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారని డీజీపీ తెలిపారు.
వారిద్దరినీ విచారించగా చంద్రబాబు కారణంగా వారికి అన్యాయం జరిగిందని వారు చెప్పినట్టుగా డీజీపీ తెలిపారు.ఇక రాజకీయంగా దీనిపై వస్తున్న విమర్శలు, కామెంట్స్ గురించి తాము మాట్లాడమని డీజీపీ చెప్పారు.







