గన్నవరం బరిలో పవన్ ఉంటాడా ?

ఏపీలో జనసేనకు బలం అంతంత మాత్రంగానే ఉన్నా రాజకీయాలు మొత్తం పవన్ చుట్టూనే తిరుగుతున్నాయి.

ఆయనకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్, ఓ ప్రధాన సామాజికవర్గం మద్దతు ఇవన్నీ పవన్ కు ఉన్న బలాన్ని తెలియజేస్తూ ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టేలా చేస్తున్నాయి.

అందుకే పవన్ గాజువాక, భీమవరంలో పోటీ చేసి ఓటమి చెందినా ఆయనకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

  జనసేన పార్టీ నుంచి ఒకే ఒక్క ఎమ్యెల్యే గెలిచినా జనసేన క్రేజ్ అలాగే ఉంది.అయితే పవన్ లో మాత్రం ఏపీ అసెంబ్లీ లో అడుగుపెట్టలేకపోయాను అన్న బాధ మాత్రం ఇప్పటికీ వెంటాడుతోందట.ఈ నేపధ్యంలో పవన్ పోటీ చేసేందుకు ఇపుడు ఒక అవకాశం వచ్చినట్టు కనిపిస్తోంది.

  టీడీపీకి రాజీనామా చేసి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని ప్రకటించిన వల్లభనేని వంశీ సీటు ఖాళీ అవుతుండడంతో గన్నవరం లో జనసేన పార్టీ అభ్యర్థిగా పవన్ బరిలో దిగితే బాగుంటుంది అన్న సలహాలు, సూచనలు పవన్ కి అందుతున్నాయి.పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళి తాను ఒక్కడిని ఉంటే చాలు మొత్తం సమస్యలు పరిష్కరిస్తానని అప్పట్లో తరచూ చెబుతూ ఉండేవారు.జగన్ పార్టీకి విపక్షం పాత్ర ఇస్తే సక్రమంగా పనిచేయడంలేదని కూడా పవన్ ఆరోపణలు చేశారు.

Advertisement

మొత్తానికి జగన్ ఇపుడు సీఎం కుర్చీలో ఉన్నారు.ఒక్క చోట నుంచి అయినా గెలిచి పవన్ విపక్ష నేతగా అసెంబ్లీలోకి అడుగుపెడితే ఆ కిక్కే వేరు అని పవన్ ఆలోచన.

  మరి ఇప్పుడు ఆ అవకాశం రానే వచ్చింది.పవన్ గన్నవరం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుంది అన్న సలహాలు సూచనలు వస్తున్నాయి.గన్నవరం సీటుకు వల్లభనేని వంశీ రాజీనామా చేశారు.

ఆయన తన రాజకీయ జీవితానికే ఫుల్ స్టాప్ పెడతాను అంటున్నారు.దాంతో తప్పనిసరిగా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందంటున్నారు.

అదే జరిగితే పవన్ పోటీ చేయాల్సిందేనని గట్టిగా వినిపిస్తోంది.అయితే గన్నవరంలో సామాజిక సమీకరణాలు దృష్ట్యా చూసుకుంటే జనసేన గెలుపు చాలా కష్టం అనే చెప్పాలి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

ఇటువంటి పరిస్థితుల్లో పవన్ పోటీకి దిగే సాహసం చేస్తాడా ? లేక ఆ పార్టీ తరపున ఎవరినైనా బరిలోకి దింపుతాడా అనేది మరికొద్ది రోజుల్లో కానీ క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడంలేదు.

Advertisement

తాజా వార్తలు