హిల్టన్ హోటల్స్ అధినేత బారోన్ హిల్టన్ లాస్ ఏంజెల్స్‌లో గురువారం కన్నుమూశారు.ఆయన వయసు 91 సంవత్సరాలు.ఈ మేరకు కోనరాడ్ హిల్టన్ ఫౌండేషన్ పత్రికా ప్రకటన విడుదల చేసింది.1927లో జన్మించిన హిల్టన్ తొలుత అమెరికా వాయుసేనలో 20 ఏళ్ల పాటు పనిచేశారు.అనంతరం 1954లో హిల్టన్ కుటుంబసభ్యుల ఆధ్వర్యంలోని వ్యాపారాలకు వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.

బారోన్ 1966లో హిల్టన్ హోటల్స్ కార్పోరేషన్‌కు ఛైర్మన్, ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు.30 ఏళ్ల పాటు అదే హోదాలో కొనసాగిన బారోన్.ఆ సమయంలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని హోటల్ సామ్రాజ్యాన్ని విస్తరించారు.
ఎన్ఎఫ్ఎల్ అమెరికన్ లీగ్‌లో భాగంగా లాస్ ఏంజెల్స్ ఛార్జర్స్ ఫ్రాంచైజీని విక్రయించేంత వరకు దానికి బారోన్ హిల్టన్ వ్యవయస్థాపక ఛైర్మన్‌గా ఉన్నారు.

2007లో హిల్టన్ హోటల్స్ కార్పోరేషన్, హర్రాహ్ ఎంటర్‌టైన్‌మెంట్ విక్రయం ద్వారా వచ్చిన 1.2 బిలియన్ డాలర్లను తన తండ్రి ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించి బారోన్ సంచలనం సృష్టించారు.బారోన్ హిల్టన్ ఎనిమిది మంది పిల్లలు, 15 మంది మునిమనవళ్లు, మనవరాళ్లతో కలిసి నివసిస్తున్నారు.







