సరిహద్దుల్లో అమెరికా రక్షణ సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో ఒక మెక్సికో పౌరుడికి న్యాయస్ధానం 70 నెలల శిక్ష విధించింది.ఈ ఏడాది ఫిబ్రవరి 7న టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రీర్ సమీపంలో ఉన్న మెక్సికో సరిహద్దు వద్ద మెలేసియో లోపేజ్ అనే 39 ఏళ్ల మెక్సికో పౌరుడు అమెరికా భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించాడు.

అదే సమయంలో అక్కడ పెట్రోలింగ్ విధులు నిర్తిస్తున్న సిబ్బందిలో ఒకరు చూసి అతనిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు.అయితే లోపేజ్ పెట్రోలింగ్ ఏజెంట్ నుంచి టార్చ్‌లైట్ లాక్కొని దానితో అతని తలపై కొట్టి తప్పించుకున్నాడు.ఈ క్రమంలో అక్కడికి దగ్గరలోనే ఉన్న సిబ్బంది లోపేజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఏడు నెలల విచారణ తర్వాత లోపేజ్‌ను దోషిగా నిర్థారించిన యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు అతనికి 70 నెలల జైలుశిక్ష విధించింది.శిక్షా కాలం పూర్తి చేసుకున్న తర్వాత లోపేజ్ అమెరికా నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది.