టీ బీజేపీ నాయకులకు హ్యాండ్‌ ఇచ్చిన అమిత్‌ షా

తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ నాయకులు.రాష్ట్ర నాయకులు మరియు జాతీయ నాయకులు కలిసి తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో తీవ్రంగా కష్టపడుతున్నారు.

 Amith Shaw Telangana Tour Cancel-TeluguStop.com

కనీసం రెండవ స్థానంలో అయినా బీజేపీని నిలపాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు.ఇదే సమయంలో జాతీయ నాయకులను రాష్ట్రానికి పదే పదే తీసుకు రావడంతో పాటు కేంద్రం నుండి రాష్ట్రంకు నిధులు ఇప్పించాలని కూడా బీజేపీ నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ జాతీయ అధ్యక్షుడు అయిన అమిత్‌ షాను రాష్ట్రంకు ఆహ్వానించడం జరిగింది.

ముందుగా అనుకున్న ప్రకారం అయితే ఈనెల 17వ తారీకున అమిత్‌ షా తెలంగాణకు రావాల్సి ఉంది.

కాని హోం మంత్రిగా బిజీగా ఉండటంతో పాటు, పార్టీకి సంబంధించిన ఇతర విషయాల పట్ల ఎక్కువ శ్రద్ద పెట్టాల్సి ఉన్న కారణంగా తెలంగాణ పర్యటనకు వచ్చే పరిస్థితి లేదు.గతంలో వస్తానని చెప్పినా తాజాగా బీజేపీ రాష్ట్ర నాయకులకు అమిత్‌ షా రావడం లేదు అంటూ ఆయన సిబ్బంది తెలియజేయడం జరిగింది.

దాంతో నిరాశ చెందిన రాష్ట్ర నాయకులు త్వరలోనే మరో కేంద్ర మంత్రిని రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube