పుతిన్ ఆఫీసులో అమెరికా కోవర్ట్ ఆపరేషన్: 2017 నుంచి గూఢచర్యం

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 2017లో రష్యాలో జరిపిన అత్యున్నత స్థాయి గూఢచర్యం గురించిన వార్తలు అంతర్జాతీయ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ అంతరంగికుల్లో ఒకడిగా వున్న అతను రష్యా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు వైట్ హౌస్‌కు చేరవేసే వాడని … అతనిపై రష్యా ప్రభుత్వానికి అనుమానాలు రావడంతో సదరు గూఢచారి క్షేమం దృష్ట్యా ట్రంప్ ఆదేశాల మేరకు ఆపరేషన్ నిలిపివేసినట్లు అమెరికన్ మీడియా కథనాలు ప్రచురించింది.

 Puthin Donald Trump Us Removed Covert Source In Russia Due To Safetyconcerns-TeluguStop.com
Telugu American Puthin, Donald Trump, Puthin, Telugu Nri Ups, Removedcovert-

  సిరియాలో ఇస్లామిక్ ఉగ్రవాదంపై ఇజ్రాయిల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్… అప్పటి రష్యా విదేశాంగ మంత్రి సర్జి లావ్‌రోవ్, అమెరికాలో రష్యా రాయబారి సర్జీ కిస్ల్యాక్‌లతో 2017 మే లో ఓవల్ కార్యాలయంలో జరిగిన సమావేశం అనంతరం అమెరికా ఈ సీక్రెట్ ఆపరేషన్‌కు తెరదీసినట్లుగా తెలుస్తోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.సదరు గూఢచారికి రష్యా అధ్యక్షుడి అధికార నివాసంలోని అణువణువు తెలుసునని.పుతిన్ ఛాంబర్‌లోని విలువైన పత్రాలను అతను ఫోటోలు తీసినట్లుగా సీఎన్ఎన్ తెలిపింది.క్లెమ్లిన్‌లోకి ప్రవేశించిన అతను సుమారు ఒక దశాబ్ధ కాలం నాటి విలువైన సమాచారాన్ని అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు అందించాడు.
రష్యాలో కోవర్ట్ ఆపరేషన్ గురించి సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపియో.

ట్రంప్ కార్యాలయంలోని ముఖ్యఅధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేసేవాడని… దానికి అతను ఆస్తి అనే కోడ్ వాడినట్లుగా తెలుస్తోంది.అదే సమయంలో కిస్ల్యాక్, లావ్‌రోవ్‌లతో సమావేశం జరిగిన కొన్ని రోజుల్లోనే జీ20 సమ్మిట్‌లో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ ప్రత్యేకంగా సమావేశయ్యారు.

రష్యాలో అమెరికా సీక్రెట్ మిషన్ గురించి ట్రంప్ నోరుజారుతారేమోనని కొందరు ఇంటెలిజెన్స్ అధికారులు కంగారుపడ్డారట.

అమెరికా… రష్యాలో కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించడానికి పలు భద్రతా కారణాలు వుండొచ్చని పలువురు నిపుణులు వాదిస్తున్నారు.

ఇందులో ప్రధానమైనది.తనతో సమానంగాఆర్ధిక, రాజకీయ, సాంకేతిక, సైనిక పరంగా ఎదుగుతున్న చైనా, రష్యాల నుంచి అమెరికా జాతీయ భద్రతకు ప్రమాదం వాటిల్లే అవకాశం వున్నందున అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు నిఘా వర్గాలు ఈ దారిని ఎంచుకున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube