టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు కొత్త రికార్డులను పరిచయం చేసిన మెగాస్టార్ చిరంజీవి నేడు 64వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.ఇక అభిమానులు సినీ తారలు పలు రాజకీయ ప్రముఖులు మెగాస్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారి అభిమానాన్ని చాటుకున్నారు.
ఇక ఇప్పుడు మెగాస్టార్ కి సంబందించి ఒక ఎవర్ గ్రీన్ న్యూస్ ని గుర్తు చేసుకోవాల్సిందే.

1992లో అత్యధిక పారితోషికం 1.25కోట్లు అందుకున్న ఏకైక నటుడు చిరంజీవి అంటూ బిగ్గెర్ దెన్ బచ్చన్ అనే టైటిల్ తో ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ ది వీక్ చిరు పోటోని కవర్ పేజీపై ప్రచురించింది.కొండవీటి దొంగ, జగదేకవీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ తో మెగాస్టార్ స్థాయి పెరిగిందని స్పెషల్ గా ఆర్టికల్ కూడా రాశారు.
ఇక మెగాస్టార్ నటించిన హిస్టారికల్ ఫిల్మ్ సైరా నరసింహా రెడ్డి ఈ నెల 30న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ లో 250కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు
.






