అమెరికాలో ఓ హాస్పటల్ కి మహిళ చెవి నెప్పితో వెళ్ళింది.డాక్టర్లు అందరూ ఒకటి తరువాత ఒకరుగా పరిశీలించిన తరువాత ఒక్క సారిగా షాక్ అయ్యారు.
తమకి ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదు అంటూ అవ్వాక్కయ్యారు.దాంతో ఆ మహిళ బోరున విలపించింది.
కానీ ఎట్టకేలకి డాక్టర్లు విజయం సాధించారు.ఏంటి అర్థం కాలేదా సరే అసలు విషయం ఏమిటంటే…

అమెరికాలోని మిస్సోరి రాష్ట్రానికి చెందిన సుజీ టోరస్ అనే ఓ మహిళ గత కొంత కాలంగా చెవి నెప్పి తో భాధ పడుతోంది.ఎన్నో మందులు వాడినా ఉపయోగం లేకుండా పోయింది.నిపుణులైన డాక్టర్లని సంప్రదించి మందులు తీసుకుంది.
అయినా సరే ఆమె చెవి నెప్పి తగ్గలేదు సరికదా చెవి నుంచీ శబ్దాలు వినిపించడం మొదలు పెట్టాయి.దాంతో కంగారు పడిన ఆమె ఆ విషయం వైద్యులకి తెలిపింది.
దాంతో
సూక్ష్మంగా పరిశీలించిన వైద్యులు ఒకరి తరువాత ఒకరు పరీక్షలు చేసి ఖంగుతిన్నారు.అసలు చెవిలో ఏముందో చూడకుండా మందులు వాడుతున్నాం అంటూ తాపీగా ఆమెకి అసలు విషయం చెప్పారు.
ఇంతకీ చెవిలో ఏముందంటే విషపూరితమైన సాలీడు గూడు కట్టుకుని ఉంది.ఈ విషయం తెలుసుకున్న ఆమెకి ఏడుపు ఒక్కటే తక్కువ.
ఆమెకి ధైర్యం చెప్పిన వైద్యులు మెల్లగా సాలీడుని అతి కష్టం మీద తీశారు.అది ఎంతో విషపూరితమైనదని ఆమెని ఏమి చేయకపోవడం ఆమె అదృష్టం అంటూ ఊపిరి పీల్చుకున్నారు.







