అమెరికాలో ఈ కామర్స్ కంపీనీలు మరీ దిగజారి పోతున్నాయి.హిందూ మతాన్ని అగౌరవ పరుస్తున్నాయి.
గతంలో యోగా మ్యాట్ లపై హిందూ దేవుళ్ళ బొమ్మలు వేసి చివరికి భారతీయులు ఆగ్రహానికి గురయ్యి, తాము ఇంకెప్పుడు భారతీయుల మనోభావాలు కించపరచబోమని, క్షమాపణలు చెప్పింది.అప్పటి వరకూ ఎన్నారైలు నిరసనలు తెలుపుతూనే ఉన్నారు.

ఇదిలాఉంటే తాజాగా మరొక అమెరికన్ ఈ – కామర్స్ కంపెనీ ఇదే రకమైన చర్యలకి పూనుకుంది.వివరాలలోకి వెళ్తే.కాలిఫోర్నియా కి చెందిన బోసి స్పోర్ట్స్ అనే కంపెనీ లో దుస్తులు తయారు చేస్తుంది.ఈ క్రమంలోనే తాను తయారు చేస్తున్న లోదుస్తులపై హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే వినాయకుడి బొమ్మని ముద్రించి 35 డాలర్ల కి అమ్మకానికి పెట్టింది.
ఈ విషయం అమెరికా వ్యాప్తంగా తెలియడంతో యూనివర్సల్ సొసైటీ ఆఫ్ హిందూయిజం అధ్యక్షుడు జెద్ తీవ్ర అభ్యంతరం తెలిపారు.వెంటనే వినాయకుడి బొమ్మలుతో ఉన్న లో దుస్తుల్ని అమ్మడం ఆపేయాలని ఆ కంపెనీ హిందువులకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ లోదుస్తుల అమ్మకం గనుకా ఆపక పొతే అమెరికాలో ఉన్న సుమారు 30 లక్షల మంది హిందువులు తీవ్రంగా స్పందిస్తారని హెచ్చరించారు.
.






