అమెరికాలో తుపాకీ నియంత్రణ చేయిస్తాం..!!!

అమెరికాలో ఎటువంటి సంస్కృతి ఉన్నా లేకపోయినా సరే తుపాకుల సంస్కృతి మాత్రం పుష్కలంగా ఉంటుంది.తుపాకుల నియంత్రణపై ఎన్ని చర్చలు జరిగినా చట్టసభలో బిల్లు ప్రవేశ పెట్టినా సరే కార్యరూపం దాల్చిన దాఖలాలు లేవు.

 Senator Mcconnell Comments On Gun Cluture-TeluguStop.com

అయితే అమెరికాలో కేవలం నెల కాలంలో దుండగుల కాల్పుల ఘటనలు నాలుగుకు పైగానే జరిగాయి.దాంతో తుపాకుల నియంత్రణ చట్టం మళ్ళీ తెరపైకి వచ్చింది.

అమెరికాలో తుపాకులు యదేశ్చగా అమ్మేస్తున్నారు, అందుకే నేరాలు పెరిగిపోతున్నాయి, కాబట్టి నూతన చట్టాలు తప్పకుండా రూపొందిన్చాల్సిందే అంటూ మెక్ కానెల్ అనే సెనేటర్ తెలిపారు.తప్పకుండా వచ్చే నెలలో ఈ విషయంపై చర్చ జరుపుతామని ఆయన అన్నారు.

కేవలం రెండు వారాల్లో అమెరికాలో నాలుగుకు పైగానే కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయని, ఈ దారుణంలో సుమారు 35 మంది చనిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలాఉంటే ఇప్పటి వరకూ అమెరికా అధ్యక్షుడు తుపాకుల నియంత్రణ పై మాటకూడా మాట్లాడటలేదు కానీ వీడియో గేమ్స్ వల్ల పిల్లల్లో క్రూరత్వం పెరిగిపోయి కాల్పులు జరుపుతున్నారు, అందుకే వీడియో గేమ్స్ పై నియంత్రణ తీసుకువస్తామని భాద్యతారహిత వ్యాఖ్యలు చేశారు.

హిల్లారీకూడా ఘాటుగా స్పందించిన విషయం విధితమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube