జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక హక్కులు కల్పించి ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో ఇప్పుడు దేశం యావత్తు మోడీకి సలామ్ కొడుతుంది.కొంత మంది లౌకిక వాదుల ముసుగులో ఆర్టికల్ 370 రద్దుని వ్యతిరేకించిన దేశ యావత్తు మోడీకి మద్దతు పలుకుతుంది.
మరో వైపు కాశ్మీర్, లధక్ ప్రాంతాలలో కూడా ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు లభిస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ జమ్మూ, కాశ్మీర్ లో శాంతి స్థాపనకి జరిగిందని.
ఇది చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు.ఇక కాశ్మీర్ లో ఉగ్రవాదం ఉండదని ఆ ప్రాంతాన్ని పర్యాతకంగా ఉపయోగించుకొని సినిమా షూటింగ్ లు చేయాలని పిలుపునిచ్చారు.
ఇక షూటింగ్ ల కారణంగా స్థానికంగా ప్రజలకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, టూరిజం అభివృద్ధి చెందుతుంది అని చెప్పారు.జమ్మూ కాశ్మీర్ లో షూటింగ్ చేయడం వలన స్థానికంగా ఉండే వాళ్లకు ఉపాధి లభిస్తుంది.
కాశ్మీర్ కు పునర్వైభవం వస్తుంది.టూరిజం డెవలప్ అవుతుందని మోడీ అన్నారు.
మోడీ ఇచ్చిన పిలుపుతో లడక్ లో సినిమా షూటింగ్ లు చేసేందుకు బాలీవుడ్ దర్శక, నిర్మాతలు సిద్ధం అయ్యారు.ఇప్పుడు లధక్ లో షూటింగ్ కి రెడీ అవుతున్న మొదటి సినిమా షంషేరా కావడం విశేషం.
యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు.చారిత్రాత్మక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది.
దీంతో పాటు పలు బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలు కూడా లధక్ లో షూటింగ్ కి రెడీ అవుతున్నాయి.







