అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన ఆ ఘటన చూస్తుంటే అమెరికా యావత్తు తలదించుకోవాల్సిందే.అమెరికాలో గతంలో నల్ల జాతీయులపై చూపించిన జాత్యాహంకారాన్ని మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నట్టుగా , అప్పట్లో నల్ల జాతీయులపై జరిగిన హేయమైన, దారుణమైన మారణకాండని తలపించే విధంగా ఉంది.
ఇంతకీ అమెరికా పోలీసులు పాల్పడిన దారుణ ఘటన ఏమిటంటే.

టెక్సాస్ లో సంకెళ్ళు వేసిన నల్ల జాతీయులని తలలతో కట్టి గుర్రాలపై అధికారులు కూర్చుని అతడిని నడిపించుకుంటూ వెళ్ళారు.ఈ ఘటన తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కలకలం రేగింది.నెటిజన్లు విమర్సల మీద విమర్శలు చేస్తున్నారు.
ఇంకా అమెరికా తన జాత్యాహంకారాన్ని వదలలేదు, గతంలో నల్ల జాతీయులని కొట్టి చంపిన ఘటనలు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి ఈ ఫోటో చూస్తుంటే అంటూ ఫైర్ అవుతున్నారు.
అమెరికా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన పై స్పందించిన టెక్సాస్ ఘటనలను ఈ ఫోటోలు మరోసారి గుర్తు చేస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
పోలీస్ ఛీఫ్ ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పారు.పోలీసు ఉన్నత అధికారి హాలే వివరణ ఇస్తూ అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన ఇతడిని అరెస్ట్ చేసి పోలీస్ వ్యానులో తీసుకుని వెళ్ళాల్సి ఉంది.
కానీ ఆ ప్రాంతంలో ఉన్న గుర్రపు పోలీసులు తీసుకువెళ్ళడంతో ఈ వివాదం చోటు చేసుకుందని తెలిపారు.దాంతో నెటిజన్లు మరింత ఫైర్ అయ్యారు.
కప్పి పుచ్చుకునే మాటలు కట్టిపెట్టండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.







