మళ్లీ థియేటర్లకు వస్తున్న 'దూకుడు'

మహేష్‌ బాబు సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు ఉన్నాయి.

మొన్నటికి మొన్న వచ్చిన మహర్షి చిత్రం, అంతకు ముందు వచ్చిన భరత్‌ అనే నేను, అంతకు ముందు వచ్చిన శ్రీమంతు ఇలా మహేష్‌బాబు కెరీర్‌లో ఎన్నో మంచి చిత్రాలు ఉన్నాయి.

ఇలాంటి సమయంలో కూడా మహేష్‌ బాబు తనకు చాలా ప్రత్యేకమైన సినిమాగా దూకుడును చెబుతూ ఉంటాడు.ఎందుకంటే ఆ సినిమా మహేష్‌బాబుకు సక్సెస్‌ అవసరం అయిన సమయంలో ఇచ్చింది.

ఆ సినిమాతోనే మహేష్‌బాబు సూపర్‌ స్టార్‌ అయ్యాడు.

అప్పటి వరకు మహేష్‌బాబు ఒక సింపుల్‌ స్టార్‌ హీరో.ఎప్పుడైతే దూకుడు సినిమా వచ్చిందో మహేష్‌ బాబు నెక్ట్స్‌ లెవల్‌కు వెళ్లి పోయాడు.మహేష్‌బాబు పోకిరి చిత్రం ఒక మెట్టు అయితే దూకుడు చిత్రం రెండు మూడు మెట్లకు మహేష్‌ ను ఎక్కించింది అనడంలో సందేహం లేదు.

Advertisement

అందుకే దూకుడు అంటే మహేష్‌కు ప్రత్యేకమైన ఇది.అందుకే తన పుట్టిన రోజు అయిన ఆగస్టు 9న తన అభిమానుల కోసం మరోసారి దూకుడు చిత్రాన్ని తన ఏఎంబీ సినిమాస్‌లో దూకుడును ప్రదర్శించాలని నిర్ణయించారు.ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి.

మహేష్‌బాబు సొంత థియేటర్‌లో ఆయనకు ఇష్టమైన దూకుడు చిత్రంను చూసేందుకు అభిమానులు ఉవ్విల్లూరుతున్నాడు.ఆ రోజు మహేష్‌ బాబు లేదా ఆయన ఫ్యామిలీకి చెందిన ఎవరో ఒకరు ఖచ్చితంగా ఫ్యాన్స్‌ షోకు వస్తారనే టాక్‌ వస్తుంది.

మరెందుకు ఆలస్యం మీకు వీలుంటే ఏఎంబీలో దూకుడు సినిమాకు టికెట్‌ బుక్‌ చేసుకోండి.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు