బెల్లంకొండ శ్రీనివాస్ అంటే టాలీవుడ్ లో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు.కెరియర్ లో మొదటి సినిమా నుంచి తనని తాను స్టార్ హీరో రేంజ్ లో ఆవిష్కరించుకోవడానికి ప్రయతించే బెల్లంకొండ శ్రీనివాస్ ని వెనకుండి తండ్రి నడిపిస్తున్నాడు.
అతనిని ఎ ప్రొడ్యూసర్ సినిమా తీసిన అతని మార్కెట్ కి మించి బడ్జెట్ ఖర్చు పెడుతూ ఉంటాడు.అయితే ప్రతి నిర్మాత వెనుక బెల్లంకొండ సురేష్ ఉంటాడని టాక్ ఉంది.
ఇదిలా ఉంటే కెరియర్ లో సక్సెస్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న యుద్ధం చేస్తున్న అతనికి రాక్షసుడు సినిమా రూమలో మొదటి హిట్ వచ్చింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం రాక్షసుడు విజయాన్ని ఆస్వాదిస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మరింత హైప్ క్రియేట్ చేసే విధంగా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.
రాక్షసుడు విజయంతో జోష్ మీద ఉన్న శ్రీనివాస్ త్వరలో మరో బడా దర్శకుడుతో సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్ళడానికి రెడీ అవుతునట్లు తెలుస్తుంది.ఈ సినిమాకి సంబంధించిన విషయాలు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయని తెలుస్తుంది.
ఈ సారి కమర్షియల్ ఎలిమెంట్స్ తో నడిచే థ్రిల్లర్ జోనర్ సినిమాని బెల్లంకొండ శ్రీనివాస్ ఒకే చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.అయితే దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.







