బీసీ హాస్టల్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది.కృష్ణ జిలా అవనిగడ్డ లోని చల్లపల్లి బీసీ హాస్టల్ ఈ ఘటన చోటుచేసుకుంది.
మూడవ తరగతి చదుతువుతున్న విద్యార్థి దాసరి ఆదిత్య నుగుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తుంది.చల్లపల్లి నారాయణనగర్‌కు చెందిన ఆదిత్య, తన అన్నతో పాటూ బీసీ హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాడు.
రోజూ రాత్రిళ్లు అన్న పక్కనే పడుకునే ఆదిత్య సోమవారం రాత్రి రూమ్‌కు రాకపోవడం తో మరో గదిలో తమ్ముడు పడుకొని ఉంది ఉంటాడు అని భావించాడు.అయితే మంగళవారం ఉదయం ఆదిత్య బాత్రూం సమీపంలో విగత జీవిలా పడి ఉండడం గమనించిన తోటి విద్యార్థులు వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు.
దీనితో వార్డెన్ పోలీసులకు సమాచారం అందించడం తో పోలీసులు అక్కడకి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే కేవలం మూడో తరగతి చదువుతున్న విద్యార్థిని ఇంత పాశవికంగా హత్య చేయడం తో పోలీసులు కారకులు ఎవరు అన్న దానిపై విచారణ చేపట్టారు.మరోపక్క కొడుకు మరణ వార్తతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.







