ఆమధ్య అమెరికా లోని టెక్సాస్ లో ఒక 57 ఏళ్ల వ్యక్తి మిస్ అయ్యాడని,ఆతరువాత ఆరా తీయగా అతని పెంపుడు కుక్కలు తినేశాయి అన్న విషయం బయటపడిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా 80 ఏళ్ల వృద్ధురాలు కూడా పెంపుడు కుక్క పీక్కుతిన్న ఘటన చోటుచేసుకుంది.
ఈ తాజా ఉదంతం మిచిగాన్ లోని డెట్రాయిట్ లో చోటుచేసుకుంది.శాలీ హానీ చెక్ అనే 80 ఏళ్ల వృద్ధురాలు ఎవరూ లేకపోవడం తో మిచిగాన్ లోని డెట్రాయిట్ లో కుక్క తో కలిసి ఒంటరిగా కాలం వెళ్లదీస్తుంది.
అయితే ఆమె పేదరికం,అనారోగ్యంతో మంచాన పడడం తో ఆమె కజిన్ కజ్మా అప్పుడప్పుడు వచ్చి హానిచెక్ బాగోగులు చూసుకుంటుంది.చాలాసార్లు ఆమెను వృద్ధాశ్రమంలో చేర్చాలని కజ్మా ప్రయత్నించింది.
అయితే, హనీచెక్ మాత్రం తన పెంపుడు కుక్కను, ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్లలేనని చెప్పేది.అయితే అప్పుడప్పుడు ఫోన్ లు చేస్తే మాట్లాడే హానిచెక్ కొద్దీ రోజులుగా కజ్మా ఫోన్ లకు స్పందించకపోవడం తో అనుమానం వచ్చి ఆమె ఇంటికి చేరుకుంది.
తీరా ఇంటికి వెళ్లి చూడగా, లోపల గడియ పెట్టి ఉండటం తో తలుపులు బద్దలకొట్టి మరి లోపలకి వెళ్లి ఇల్లంతా వెతికినా ఆమె కనిపించలేదు.చివరికి వంట గది నుంచి తీవ్రమైన దర్గంధం వస్తుండటంతో అటుగా వెళ్లి చూడగా, అక్కడ కుర్చీలో అస్థిపంజరాన్ని చూసి ఒక్కసారిగా ఖంగుతినింది.
దీనితో పోలీసులకు వెంటనే సమాచారం అందించడం తో హుటాహుటిన అక్కడకి చేరుకున్న పోలీసులు అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మరో గదిలో అనారోగ్యంతో కదల్లేని పరిస్థితిలో ఉన్న ఆమె పెంపుడు కుక్క రాట్వైలర్ జాక్‌ను కూడా వెంట తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించగా, అప్పుడు ఈ విషయం బయటపడింది.ఆమె సహజ మరణమే పొందింది అని కాకపోతే ఆమె మరణించిన తరువాత ఇంట్లోనే బందీగా ఉన్న కుక్క, ఎలుకలు ఆమె శరీరాన్ని కొరికి తిన్నట్లు శవ పంచనామా లో వెల్లడైంది







