విజయవాడ టీడీపీలో తాజాగా కుమ్ములాటలు ఎక్కువయ్యాయి.అధినేతని కనీసం లెక్కచేయకుండా బొండా ఉమ, కేశినేని నాని రోజు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
చంద్రబాబు వారిని నియంత్రించే ప్రయత్నం చేసిన వారు మాత్రం అస్సలు లెక్క చేయడం లేదు.మరో వైపు టీడీపీ పార్టీని వీడే నాయకుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది.
తాజాగా బెజవాడ నుంచి గత ఎన్నికలలో పోటీ చేసిన దేవినేని వారసుడు దేవినేని అవినాష్ టీడీపీ పార్టీకి రాజీనామా చేసాడు.దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన అవినాష్ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
తరువాత తండ్రితో పాటు టీడీపీలో చేరిన అవినాష్ తాజాగా జరిగిన ఎన్నికలలో గుడివాడ నుంచి పోటీ చేసి కొడాలి నాని మీద భారీ తేడాతో ఓడిపోయాడు.పోటీ చేసిన తొలి ఎన్నికలోనే ఓడిపోవడంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకున్నారు.
గత ఎన్నికల్లో గుడివాడ ఓడిపోయిన నాని ద్వారానే వైసీపీ పార్టీలోనికి మారనున్నట్లు సమాచారం.ఇక దేవినేని అవినాష్ అనుచరులు కూడా ఆయన వైసీపీలోకి వెళ్లే అంశంపై స్పష్టత ఇచ్చారు.
ప్రస్తుతం ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి జెరూసలేం ఇజ్రాయిల్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.జగన్ ఈ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత అవినాష్ సీఎం సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
అవినాష్ తో పాటు ఆయన అనుచరులు కూడా వైసీపీలోకి జంప్ చేస్తున్నట్టు తెలుస్తోంది.ఇక వైసీపీలో చేరితే అవినాష్కు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ పగ్గాలు ఇస్తామని హామీ వచ్చినట్టు తెలుస్తోంది.







