గత ఎన్నికల్లో భారీ గా దెబ్బ తిన్న టీడీపీ పార్టీకి వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది.ఇప్పటికే పలువురు కీలక నేతలు సైకిల్ దిగి కాషాయం కండువా కప్పుకోగా ఇప్పుడు తాజాగా మరో కీలక నేత కూడా కాషాయం కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తుంది.
మొన్నటికి మొన్న భూమా సోదరులు టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిపోయారు.ఇప్పుడు తాజాగా టీడీపీలో కీలక నేతగా ఉన్న సీనియర్ రాజకీయ నాయకుడు గంగుల ప్రతాప్ రెడ్డి కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైపోయినట్లు తెలుస్తుంది.
ఇప్పటికే సీఎం రమేష్,టీజీ వెంకటేష్,సుజనా చౌదరి వంటి కీలక నేతలు పార్టీ షిఫ్ట్ అవ్వగా ఇప్పుడు కీలక నేత ఐన గంగుల ప్రతాప్ రెడ్డి కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు తెలుస్తుంది.అందులో భాగంగా ఆయన పార్టీ జాతీయ నాయకులను కలిసి చర్చించగా,కర్నూలు జిల్లాలో తగిన ప్రాధాన్యం ఇస్తామని, పార్టీ అభివృద్ధి కోసం పాటు పడాల్సిందిగా సూచించినట్లు తెలుస్తుంది.
మొత్తానికి టీడీపీ పార్టీ మరో దెబ్బ పడనున్నట్లు మాత్రం అర్ధం అవుతుంది.

ఇంకా మరిన్ని జంపింగ్ లు ఉంటాయో చూడాలి.ఇప్పటికే బోండా ఉమా కూడా పార్టీ ఫిరాయింపుకు సిద్దమైనట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఆయన స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.
విదేశాల్లో బంగీ జంప్ చేస్తున్న ఆయన ఫోటోలను చూసిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు ఈ జంప్ ఎక్కడకో అంటూ కామెంట్లు పెడుతున్నారు కూడా.







