యూఏఈ లో ఉంటున్న ఓ భారతీయుడు ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక తాను ఆత్మ హత్య చేసుకుంటున్నట్టుగా ట్వీట్ చేశాడు.అయితే ఎవరూ ఊహించని విధంగా ఆ వ్యక్తి చేసిన ట్వీట్ కి ప్రతిగా యూఏఈ పోలీసులు స్పందిచారు.
అతడితో మాట్లాడిన పోలీసులు అతడిచే ఆ ప్రయత్నాన్ని విరమింప చేశారు.తనకి తగిన సాయం చేస్తామని తెలిపిన పోలీసులు తడిని కాపాడంతో ఈ వార్త సంచలనం సృష్టించింది.
వివరాలలోకి వెళ్తే.
ఇండియాకి చెందిన సుమారు 50 ఏళ్ళ ఓ వ్యక్తి ఆర్ధిక సమస్యలతో అక్కడ నానా కష్టాలు అనుభవిస్తున్నాడు.ఈ భాధలు తట్టుకోలేక తాను చనిపోతున్నాను అంటూ ట్వీట్ చేశారు.ఈ ట్వీట్ కి స్పందించిన జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ షార్జా పోలీసులు వెంటనే ఆవ్యక్తికి ఫోన్ చేశారు.
అతడిని సంప్రదించిన పోలీసులు చట్ట ప్రకారం ఎలాంటి సాయం చేయాలో అన్నీ చేస్తామని నీ నిర్ణయం మార్చుకోవాలని కోరారు.దాంతో అతడు ఆ ప్రయత్నం విరమించారు.
వెంటనే పోలీసులు అతడిని కలిసి సమస్యలని అడిగి తెలుసుకున్నారు.సాధ్యమైనంత త్వరగా సమస్యలని తీర్చుతామని భరోసా ఇచ్చారు.
అలాగే అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి అతడిలో ధైర్యాన్ని నింపారు.అయితే ఇలాంటి సందేశాలు వచ్చినప్పుడు మేము సీరియస్ గానే పరిగణిస్తామని అధికారులు తెలిపారు.