డిగ్రీ పట్టా అందుకోవడం కోసం తల్లి లేని ఆ విద్యార్థి ఏమిచేశాడంటే

ఒక విద్యార్థి దశలో పిల్లలకు చదువు ఎంతో ముఖ్యం, ఆ చదువు ను వారికి అందించడం కోసం తల్లిదండ్రులు ఎంతో తిప్పలుపడి మరి వారిని చదివిస్తూ ఉంటారు.అలాంటి చదువు లో పట్టా పుచ్చుకుంటున్నప్పుడు తల్లిదండ్రుల సమక్షంలో తీసుకుంటే ఆ ఆనందం వేరేలా ఉంటుంది.

 Student Brought A Life Size Cutout Of His Mom To His Graduation-TeluguStop.com

అయితే అలిసాంగ్ అనే విద్యార్థికి కూడా అలాంటి కొరికే ఉంది.తను పట్టా అందుకుంటున్నప్పుడు తన తల్లి తన పక్కన ఉండాలని.

కానీ దురదృష్టం అతడి తల్లి చనిపోవడం తో అతడి కోరిక తీరలేదు.దీనితో అతడు తన కోరికను నెరవేర్చుకోవడం కోసం ఏమి చేశాడంటే.

తల్లి లైఫ్‌సైజ్ కటౌట్‌‌ను తన వెంట తెచ్చుకుని, ఆ కటౌట్‌తోనే గ్రాడ్యూయేషన్ పట్టా అందుకున్నాడు.అలిసాంగ్ అనే విద్యార్థి ఫిలిపిన్స్ యూనివర్శిటీకి చెందిన లైసియంలో చదివాడు.

గ్రాడ్యూయేషన్ పట్టా అందుకొనేప్పుడు తన తల్లి పక్కన ఉండాలని కోరుకున్నాడు.అయితే, అతడి తల్లి 2016లో అనారోగ్యంతో చనిపోవడం తో గ్రాడ్యూయేషన్ వేడుక రోజు అలిసాంగ్ తన తల్లి కటౌట్‌తోనే పాల్గొన్నాడు.

డిగ్రీ పట్టా అందుకోవడం కోసం త

అనంతరం ఆ ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ ‘‘అమ్మా, నువ్వు కోరుకున్నట్లే గ్రాడ్యూయేషన్ పూర్తిచేశాను.నువ్వు సంతోషిస్తావని భావిస్తున్నాను’’ అని తెలిపాడు.దీంతో ఇప్పుడు ఆ ఫొటో సోషల్ మీడియాలో కాస్త వైరల్‌గా మారింది.నిజంగా అతడు తన తల్లిని ఎంత మిస్ అవుతున్నాడో ఈ విషయం చూస్తే అర్ధం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube