'డియర్‌ కామ్రేడ్‌' సెకండ్‌ హాఫ్‌ గురించి బ్యాడ్‌ టాక్‌

విజయ్‌ దేవరకొండ మూవీ అనగానే యూత్‌ ఆడియన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.గీత గోవిందం చిత్రం తర్వాత విజయ్‌ మరియు రష్మికలు మళ్లీ కలిసి నటించిన చిత్రం అవ్వడంతో ఈ చిత్రంపై మరింతగా అంచనాలున్నాయి.

 Vijaydevarakonda Dearcomreade Secondhalftalk 1-TeluguStop.com

వీరిద్దరి కాంబోలో సినిమా మరోసారి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకోవడం ఖాయం అంటూ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు.టీజర్‌ మరియు ట్రైలర్‌లు అంచనాలు పెంచే విధంగా ఉండటంతో పాటు, ప్రమోషన్స్‌తో సినిమా స్థాయిని ఎక్కడికో చేర్చారు.

అయితే సినిమా సెకండ్‌ హాఫ్‌ గురించి ఫిల్మ్‌ సర్కిల్స్‌లో బ్యాడ్‌ టాక్‌ నడుస్తోంది.

'డియర్‌ కామ్రేడ్‌' సెకండ్‌ హాఫ

సెన్సార్‌ బోర్డు సభ్యుల కథనం ప్రకారం అంటూ ఫిల్మ్‌ సర్కిల్స్‌లో సినిమా సెకండ్‌ హాఫ్‌ గురించి చర్చ జరుగుతోంది.సెకండ్‌ హాఫ్‌లో సినిమా కాస్త స్లోగా సాగిందని, మొదటి హాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగితే సెకండ్‌ హాఫ్‌లో ఎక్కువ సీరియస్‌ సీన్స్‌ ఉండటంతో పాటు కొన్ని బోరింగ్‌ సీన్స్‌ కూడా ఉన్నాయంటూ వారు చెప్పారట.ఈ చిత్రం మూడు గంటలు ఉండటం వల్ల కూడా సినిమాకు నష్టం జరిగే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

యాంటీ విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ లేదంటే రౌడీ స్టార్‌ క్రేజ్‌ను తట్టుకోలేక పోతున్న కొందరు ఇలాంటి పుకార్లను పుట్టిస్తున్నట్లుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.యాంటీ విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ ప్రస్తుతం ఈ సినిమా టాక్‌ను ఎక్కువగా స్ప్రెడ్‌ను చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ మాత్రం ఈ విషయం పుకార్లే అంటూ కొట్టి పారేసేందుకు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube