తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 ప్రారంభం అయ్యింది.మొదటి రెండు సీజన్‌లతో పోల్చితే మూడవ సీజన్‌లో బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన పార్టిసిపెంట్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నారు.
తప్పకుండా ఈ 15 మంది మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించడం ఖాయం అనుకుంటున్నారు.ఇక ఈ సీజన్‌కు మాత్రమే కాకుండా బిగ్‌బాస్ చరిత్రలోనే చాలా ప్రత్యేకమైన విషయం ఏంటీ అంటే భార్య భర్తలు అయిన వరుణ్ సందేశ్ మరియు వితిక షేరులు హౌస్‌లోకి వెళ్లడం.
భార్య భర్తలు కలిసి ఉండి రొమాంటిక్ గా ఉండటం చాలా కామన్‌గా చూస్తూనే ఉంటాం.

వంద రోజులు భార్య భర్తలు కలిసే ఉండటం, వారి మద్య రొమాన్స్ జరగడం మనం చూస్తూనే ఉంటాం.అయితే ఆ రొమాన్స్ కొన్ని రోజుల తర్వాత ఉంటుందని అనుకున్నాం.కాని రెండవ రోజే వరుణ్ సందేశ్ మరియు వితిక షేరుల మద్యద రొమాంటిక్ సన్నివేశం చోటు చేసుకుంది.
తనను హగ్ చేసుకోవాలంటూ వితిక కోరడం అందరి దృష్టిని ఆకర్షించింది.పక్కన మహేష్ విట్ట మరియు రాహుల్ ఉన్నా, కెమెరాలు అటువైపే తిరిగి చూస్తున్నా కూడా ఇద్దరు హగ్ చేసుకున్నారు.
వీరిద్దరి మద్య రొమాన్స్‌తో బిగ్‌బాస్‌కు మంచి టీఆర్పీ రేటింగ్ రావడం ఖాయం అంటూ నిర్వాహకులు చాలా నమ్మకంగా ఉన్నారు.వీరిద్దరు హీరో హీరోయిన్‌గా సుపరిచితం.
అందుకే ప్రేక్షకులు వీరిద్దరికి వెంటనే కనెక్ట్ అవ్వడం ఖాయం.ముందు ముందు ఎపిసోడ్స్‌లో వీరిద్దరిమద్య గొడవలు, గిల్లికజ్జాలు, రొమాంటిక్ సీన్స్ చాలానే చూడవచ్చేమో.







