అమెరికాలో ఒక్క సారిగా నోట్ల వర్షం కురవడంతో ప్రజలు ఒక్క సారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.రోడ్లపై వరదలా పడిన నోట్లని తీసుకోవడానికి బారులు తీరారు.
కార్లలో వెళ్ళే వాళ్ళు సైతం కిందకి దిగి మరీ నోట్ల కోసం పోటీ పడి దొరికినంతగా జేబూలు నింపుకుంటున్నారు.దాంతో ఆనోటా ఈనోటా తెలిసి కరెన్సీ కోసం స్థానిక ప్రజలు ఆ ప్రాంతానికి తండోప తండాలుగా చేరుకున్తున్నారట.
మరి ఈ నోట్ల వర్షం ఎలా కురిసింది, డబ్బులు వరదలా ఎలా పడింది, జేబుల్లో నింపుకున్న డబ్బుల మొత్తం ఎంత అనే వివరాలలోకి వెళ్తే.

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఈ ఆశ్చర్య కర ఘటన చోటు చేసుకుంది.అట్లాంటాలో ఓ ఆర్మీ ట్రక్కు కరెన్సీ లోడుతో వెళ్తోంది.అయితే ఈ క్రమంలో మార్గం మధ్యలో ఒక్క సారిగా ఆ ట్రక్కు డోర్లు తెరుచుకోవడంతో పాటు బలమైన గాలులు వీచడంతో ఆ ట్రక్కులో ఉన్న డాలర్లు మొత్తం రోడ్డుపై వర్షం కురిసినట్టుగా ట్రక్కులో నుంచీ పడిపోయాయి.దాంతో

రోడ్లపై పడిన నోట్లని తీసుకోవడానికి అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికంగా ఉన్న ప్రజలు అందరూ త్వరపడి నోట్లని జేబుల్లో నింపుకున్నారు.దొరికిన వాడికి దొరికినంతగా దండుకుని ఎంచక్కా దర్జాగా కార్లలో చెక్కేశారు.అయితే ఇలా రోడ్లపై పడిన ఈ మొత్తం సొమ్ము ఎంతో తెలిస్తే షాక్ అవ్వక మానరు.ఈ మొత్తం సొమ్ము అంతా కలిపి దాదాపు లక్షా 75 వేల డాలర్లని అధికారులు తెలిపారు.







