అమెరికాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా ముంచెత్తిన వరదలు పలు ప్రాంతాలలో ప్రజలని భయబ్రాంతులకి గురిచేస్తున్నాయి.నాలుగు రోజుల పాటుగా ఎడతెరపి లేకుండా వస్తున్నా వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి.
ఈ ప్రభావంతో లూసియానా రాష్ట్రంలో మిసిసిపీ నది పొంగి ప్రవహించడంతో న్యూ ఓర్లీన్స్ నగరం వరదల్లో పూర్తిగా చిక్కుకుంది.దాంతో వాహనాలు, ఇల్లు నీట మునిగిపోయాయి.
దాంతో స్థానిక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

ఓర్లీన్స్ నగరంతో పాటుగా లూసియానా, వర్జీనియా, మేరీల్యాండ్, నగరాలు కూడా నీట మునిగాయి.
మిసిసిపీ నదీ ప్రవాహంతో 20 అడుగుల ఎత్తు వరకూ నీళ్ళు వ్యాపించడంతో రోడ్లు కనిపించనంతగా జలమయం అయ్యాయి.ఇదిలాఉంటే ఈ తుఫాను ప్రభావం టెక్సాస్ రాష్ట్రానికి కూడా చేరుతుందని తెలియడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.
ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయక చర్యలు తీసుకుంటున్నారు.అంతేకాదు.

కొన్ని రోజుల క్రితం భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తిన అమెరికాలోని వాషింగ్టన్ నగరంలోని పరాలు ప్రాంతాలలో నీరు ఇంకా నిలిచే ఉంది.అయితే 1871 తర్వాత అంతటి భారీ స్థాయిలో వర్షాలు పడటం ఇవేనని అధికారులు అంటున్నారు.అన్ని రాష్ట్రాల ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేస్తూ, సహాయక చర్యలు చేపడుతున్నారు.






