పౌరాణిక చిత్రాల్లో నటించడమంటే అంత సాధారణమైన విషయం కాదు.అలాంటి సినిమాలు చేయడానికి నేటితరం హీరోలకు పెద్ద ఛాలెంజ్ అని చెప్పవచ్చు.
ఎంతో కఠోర శ్రమ అలాగే దర్శకుడి మేకింగ్ పై నమ్మకం కలిగితేనే తెరపై పాత్రలు ఆకట్టుకుంటాయి.అయితే కెరీర్ లో మొదటిసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి రాముడిగా అఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఇటీవల అల్లు అరవింద్ బాలీవుడ్ టెక్నీషియన్స్ తో కలిసి రామాయణ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.3డి ఫార్మాట్ లో దాదాపు 15 వందల కోట్లతో తెరకెక్కనున్న ఆ సినిమా మూడు భాగాలుగా విడుదల కానుంది.అయితే సినిమాలో రాముడి పాత్రకోసం మొదట రామ్ చరణ్ ని అనుకున్నారట.
ముందే అల్లు అరవింద్ మేనల్లుడిని అడగ్గా అందుకు వీలుపడదని మెగా హీరో సున్నితంగా తిరస్కరించాడట.
రీసెంట్ దర్శకులు నితేశ్ తివారి – రవి ఉద్యావర్ లు కూడా రామ్ చరణ్ పేరును ప్రస్తావించగా చెర్రీ ఈ అఫర్ ను తిరస్కరించినట్లు సమాచారం.