మాస్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బోయపాటి నెక్స్ట్ బాలకృష్ణతో సినిమా చేస్తాడా లేడా అనేది పెద్ద సందేహంగా మారింది.దిల్ రాజు నిర్మించిన భద్ర సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బోయపాటి మళ్ళీ చాలా కాలం తరువాత దిల్ రాజుతో సినిమా చేసేందుకు సిద్దమయ్యాడు.
తన నెక్స్ట్ సినిమాను నిర్మించాలని దిల్ రాజుకి కథ చెప్పిన దర్శకుడు బాగానే మెప్పించాడు.అయితే బాలకృష్ణ చెప్పినట్టుగానే బడ్జెట్ విషయంలో కాస్త వెనక్కి తగ్గాల్సిందే అని రాజు చెప్పారట.
కథలో మార్పులు చేసుకొచ్చిన బోయపాటి ఫైనల్ గా 90కోట్ల నుంచి 70కోట్లకు సినిమా బడ్జెట్ ను తెచ్చినప్పటికీ వర్కౌట్ అవ్వడం లేదు.

దిల్ రాజు ఆ నెంబర్ ని కూడా ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది.గతంలో ఇండియన్ 2 సినిమాను నిర్మించాలని అనుకున్న దిల్ రాజు కమల్ హాసన్ రెమ్యునరేషన్ 35కోట్లనగానే ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు.
ఇక ఇప్పుడు బాలకృష్ణతో చేయబోయే సినిమాకు ఆ రేంజ్ లో బడ్జెట్ అంటే ఇన్వెస్ట్ చేయడానికి భయపడుతున్నాడట.
అయితే దిల్ రాజు మాత్రం బోయపాటిని నిరాశసపరచకుండా 50కోట్లలో ట్రై చేద్దామని ఒక మాట అనుకున్నట్లు టాక్.







