విడ్డూరం : సరదాగా ఐస్‌క్రీం నాకినందుకు 20 ఏళ్లు జైలు శిక్ష అసలు మ్యాటర్‌ ఏంటో తెలిస్తే అవాక్కవాల్సిందే

మన దేశంలో హత్యలు చేసి మానబంగాలు చేసిన వారు కూడా యదేచ్చగా బయట తిరిగేస్తున్నారు.

ఎన్ని మర్డర్‌లు చేసినా కూడా శిక్ష పడేందుకు కాస్త సమయం పడుతుంది.

అది కూడా మరణ శిక్ష పడుతుందా లేదా అనేది అనుమానమే.అలాంటిది కొన్ని దేశాల్లో మాత్రం చిన్న తప్పులకు కూడా చాలా పెద్ద శిక్షలు పడుతూ ఉంటాయి.

అరబ్‌ దేశాల్లో అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారికి ఎంత కఠిన శిక్షలు ఉంటయో మనం చూశాం.దొంగతనాలు చేసిన వారిని అక్కడ ఎలా శిక్షిస్తారో మనం చూశాం.

కాని అమెరికాలో ఒక చిన్న తప్పుకు ఒక యువతికి ఏకంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడబోతుందట.

Advertisement

పూర్తి వివరాల్లోకి వెళ్తే.అమెరికా టెక్సాస్‌కు చెందిన ఒక యువతి కొన్నాళ్ల క్రితం ఒక షాపింగ్‌ మాల్‌కు వెళ్లింది.అక్కడ సరదాగా స్నేహితురాలితో కలిసి ఎంజాయ్‌ చేసింది.

ఆ సమయంలోనే ఒక ఐస్‌ క్రీం డబ్బాను ఓపెన్‌ చేసి దాన్ని కాస్త నాకి మళ్లీ డబ్బా క్లోజ్‌ చేసి యదాస్థానంలో పెట్టింది.ఈ సంఘటన మొత్తంను స్నేహితురాలు సరదాగా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

ఆ స్నేహితురాలు సరదాగా చేసిన పని కాస్త ఈమెకు పెద్ద భారంగా మారింది.ఆ వీడియోను కొందరు పోలీసులకు ఫార్వర్డ్‌ చేయడంతో పోలీసులు చర్యలు తీసుకునేందుకు కేసు నమోదు చేశారు.కేసు నమోదు చేసి కోర్టు ముందుకు తీసుకు వెళ్లారు.

కోర్టు విచారణలో ఆమె చేసింది తప్పని నిరూపితం అయ్యింది.అమెరికాలో ఇలాంటి నిర్లక్ష్యపు పనులకు కఠిన శిక్షలు ఉంటాయి.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

దాంతో ఆమెకు 20 ఏళ్ల జైలు శిక్ష మరియు దాదాపుగా 7 లక్షల రూపాయల జరిమానా పడవచ్చు అంటూ అక్కడ న్యాయ నిపుణులు అంటున్నారు.పాపం సరదాగా చేసిన పనికి మరీ ఇంత కఠిన శిక్షనా.?.

Advertisement

తాజా వార్తలు