కె.జి.యఫ్ సినిమాతో ఒక్కసారిగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేసిన కన్నడ హీరో యష్ ప్రభాస్ కోసం ఒక మంచి కథను సెట్ చేశాడట.అప్పట్లో ప్రభాస్ కె.జి.యఫ్ ప్రమోషన్ లో పాల్గొని యష్ కి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే అంతకుముందు నుంచే ఈ ఇద్దరికి మంచి సాన్నిహిత్యం ఉంది.
యష్ అండ్ ప్రభాస్ స్నేహితులైనప్పటి నుంచి ఒకరికి సంబంధించిన కథలు మరొకరి తో రెగ్యులర్ గా షేర్ చేసుకుంటున్నారట.
అయితే ఇటీవల యష్ దగ్గరికి కొన్ని కథలు రాగా అందులో ఒక యువ దర్శకుడు చెప్పిన కథ ఈ కన్నడ హీరోకి బాగా నచ్చేసిందట.నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తయారుచేసిన ఆ స్క్రిప్ట్ కి ప్రభాస్ అయితేనే కరెక్ట్ గా న్యాయం చేయగలడని మరో మాట లేకుండా ఈ కథ ప్రభాస్ తో చేస్తేనే బెటర్ అని సలహా ఇచ్చాడట.

తనకున్న పరిచయంతో ఆ యువ దర్శకుడిని ప్రభాస్ దగ్గరికి పంపించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.ప్రభాస్ కూడా యష్ మాటకు విలువిచ్చి ఓ సారి కథ వినడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.అయితే ఆ యువ దర్శకుడు ఎవరనేది ఇంకా బయటపడలేదు.కానీ అతను ఖచ్చితంగా కొత్త దర్శకుడని శాండీల్ వూడ్ లో కథనాలు వెలువడుతున్నాయి.మరి వందల కోట్ల మార్కెట్ తో దూసుకుపోతున్న ప్రభాస్ అనుభవం లేని ఆ యువ దర్శకుడితో వర్క్ చేయడానికి ఒప్పుకుంటాడో లేదో.?
.






