హాలీవుడ్ సినిమాలో అవకాశం అందుకున్న కాజల్ అగర్వాల్

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా దశాబ్ద కాలం పాటు తనదైన హవా కొనసాగించిన భామ కాజల్ అగర్వాల్.ఈ భామ ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ అయిపొయింది.

 Kajal Got A Chance In Hollywood Movie1-TeluguStop.com

దీంతో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు కొత్తదనం ఉన్న సినిమా సినిమాల వైపు కూడా మొగ్గు చూపిస్తుంది.ఇదే సమయంలో స్టార్ హీరోలతో జత కట్టే అవకాశం ఈ భామకి చాలా వరకు దూరం అయ్యింది అని చెప్పాలి.

ఒక వేళ చేసిన సీనియర్ హీరోలకి జోడీగా మాత్రమే తీసుకునే అవకాశం ఉంది.అయితే ప్రస్తుతం ఆమె అటు తమిళంలో పారిస్ పారిస్ అని క్వీన్ రీమేక్ తో పాటు, తెలుగులో తేజ దర్శకత్వంలో తానే నిర్మాతగా ఓ సినిమా మరి ఓ సినిమా చేస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ భామ ఓ హాలీవుడ్ మూవీలో అవకాశం సొంతం చేసుకుంది అనే టాక్ వినిపిస్తుంది.టాలీవుడ్ హీరో మంచు విష్ణు తెలుగు, ఇంగ్లీష్ భాషలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నాడు.

దీనిని ఓ హాలీవుడ్ దర్శకుడు దర్శకత్వంలో ప్లాన్ చేస్తున్నాడు.ఇక ఈ సినిమాలో లీడ్ రోల్ కోసం కాజల్ అగర్వాల్ ని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని సమాచారం.అదే నిజమైతే సౌత్ నుంచి హాలీవుడ్ వైపు వెళ్తున్న హీరోయిన్ గా కాజల్ పేరు నిలిచిపోవడం గారంటీ అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube