పాక్ ప్రధాని మొత్తం ఆస్థి విలువ ఎంతో తెలుసా

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆస్థి విలువ ఎంతో తెలుసా.ఆయనకు 10.

8 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తుంది.ఈ వివరాలు అన్నీ ఇప్పుడు ఎందుకు అని అనుకుంటున్నారా.

అక్కడ ఇమ్రాన్ ఖాన్ తో పాటు ప్రధాన రాజకీయ నేతల ఆస్తుల వివరాలను ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది.ఈ నేపథ్యంలో ఇమ్రాన్ కు మొత్తం 108 మిలియన్ల ఆస్తులను కలిగి ఉన్నట్లు తెలిపింది.

అలానే ఇమ్రాన్ కు మూడు విదేశీ కరెన్సీ ఖాతాలు ఉన్నాయని, వాటితో పాటు 150 ఎకరాల వ్యవసాయ భూమి,అలానే 50 వేల విలువ చేసే 4 మేకలు ఉన్నట్లు ఈసీ అధికారులు ప్రకటించారు.అయితే ఆయనకు ఉన్న బనీ గలా ఎస్టేట్‌ తనకు తన మొదటి భార్య, బ్రిటీష్‌ పాత్రికేయురాలు జెమీమా గోల్డ్‌స్మిత్‌ కానుకగా ఇచ్చిందని ఈసీ అధికారులకు ఇమ్రాన్ తెలిపినట్లు ఈసీపీ ప్రకటించింది.

Advertisement

మంగళవారం ఈసీపీ ప్రకటించిన వివరాల్లో అత్యధిక ఆస్తులు ఉన్నవారిలో పాక్‌ మాజీ అధ్యక్షుడు అసీఫ్‌ అలీ జర్దారీ నిలిచారు.ఆయనకు రూ.660 మిలియన్‌ను ఉన్నట్లు తెలిసింది.నగదు అక్రమ చలామణి కేసుల్లో ప్రస్తుతం ఆయన ఎన్‌ఏబీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.ఆయన వద్ద రూ.10 మిలియన్ల విలువచేసే జంతువులు, రూ.16.6 మిలియన్ల విలువ చేసే ఆయుధాలు ఉన్నట్లు ఈసీపీ అధికారులు పేర్కొన్నారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు