నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ తర్వాత ఆ స్థాయి స్టార్ హీరోలుగా కొనసాగుతున్న నటులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.ఎన్టీఆర్ ఇప్పటికే స్టార్ హీరోగా వంద కోట్ల రేంజ్ కి వెళ్ళిపోయాడు.
తమ్ముడు స్ఫూర్తితో కళ్యాణ్ రామ్ కూడా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సొంతం చేసుకునే ప్రయత్నం చేసుకున్నాడు.దీని కోసం నిర్మాతగా మారి తన సినిమాలని తానే నిర్మించుకుంటు కొత్త దర్శకులకి అవకాశాలు ఇస్తున్నాడు.
అయితే ఎక్కువగా ప్రయోగాల జోలికి వెళ్ళడంతో కళ్యాణ్ రామ్ కి అనుకున్న స్థాయిలో విజయాలు అందలేదు.ఈ నేపధ్యంలో కమర్షియల్ సినిమాలపై ద్రుష్టి పెట్టిన ఇతను ఆ దిశగా సినిమాలు ఎంపిక చేసుకుంటున్నాడు.
ఇదిలా ఉంటే ఈ నేపధ్యంలో కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ లో వేణు మల్లిడి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.ఇందులో కళ్యాణ్ రామ్ పాత్ర ఎన్టీఆర్ లవకుశ సినిమాలో రావణ తరహాలో నెగిటివ్ షేడ్స్ లో ఉంటుందని తెలుస్తుంది.
దీని కోసం ముందుగా సినిమాకి తుగ్లక్ అనే పేరు అనుకున్న ఇప్పుడు ఆ ఆలోచన మార్చుకొని రావణ అనే కొత్త టైటిల్ ని ఫైనల్ చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది.ఎన్టీఆర్ ఆర్ట్స్ పేరిట ఛాంబర్‌లో రావణ అనే టైటిల్ రిజిస్టర్ చేయించడంతో అది తన సినిమా కోసమే అనే టాక్ వినిపిస్తుంది.
ఇప్పటికే జై లవకుశ సినిమాలో రావణా సాంగ్ బాగా పాపులర్ కావడంతో ఈ టైటిల్ అయితే జనాలకి చేరుతుందని కళ్యాణ్ అలా ఫిక్స్ అయినట్లు సమాచారం.








