మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు చేదు ఫలితాలు ఎదురయ్యాయి.కనీసం ఆ పార్టీ అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాణ్ కూడా గెలుపొందలేక పోయాడు.
దాంతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ అయిదు సంవత్సరాలు ఖాళీగా ఏం చేస్తాడు, కనీసం సినిమాలు అయినా తీసుకుంటే నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చు కదా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ లుక్ మార్చడంతో సినిమాల్లోకి రాబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ గురించిన వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.అయితే ఇప్పటి వరకు పవన్ నుండి ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు.రాజకీయాలు చేస్తూ సినిమాలు చేసే వారు చాలా మందే ఉన్నారు.అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు చేయాలని కొందరు ఆశ పడుతున్నారు.
కాని పవన్ కు మాత్రం సినిమాలు చేయడం ఇష్టం లేదని తేలిపోయింది.పవన్ కేవలం రాజకీయాలపైనే పూర్తి ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నాడట.
తాజాగా ఈ విషయాన్ని స్వయంగా నాగబాబు వెళ్లడించాడు.తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలకు పరిమితం అవ్వాలని భావిస్తున్నాడు.
అందుకోసమే సినిమాల్లోకి రావాలని కోరుకోవడం లేదు.ఒక వేళ మేము బలవంతం చేస్తే గెస్ట్ రోల్స్‌లో చేస్తాడేమో కాని పూర్తి నిడివితో సినిమాను చేసేందుకు ఆసక్తిగా లేడు అంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు.
ఈ విషయంలో పవన్ నిర్ణయం మారుతుందని తాను భావించడం లేదని కూడా నాగబాబు అన్నాడు.







