అమెరికాలో ఓ ఘటన కలకలం సృష్టించింది.మెక్సికో సరిహద్దులో ఇద్దరు మహిళలు సుదూరంగా నడుస్తూ ఎంతో అలసట చెందుతూ భద్రతా దళాల కంట కనిపించారు.
దాంతో భద్రతా దళాలు వారివద్దకు చేరుకొని, సరిహద్దు ప్రాంతంలో ఏమి చేస్తున్నారని అడుగగా తమని కొందరు స్మగ్లర్లు ఆ ప్రాంతానికి తీసుకువచ్చి వదిలేశారని తెలిపారు.వారిని భారత్ కి చెందిన వారిగా భద్రతా దళాలు గుర్తించాయి.

వారి విచారంలో ఆ ఇద్దరు మహిళలు మాత్రమే కాకుండా మరో మహిళ ఇద్దరు పిల్లలు ఉండాలని అయితే తెలిపారు.అయితే మార్గ మధ్యంలో వారు వేరే దిశగా వెళ్లిపోయారని అన్నారు.దాంతో గాలింపు చేపట్టిన భద్రతా దళాలకి సరిహద్దు ప్రాంతంలో లుక్విల్లె ప్రాంతంలో ఓ బాలిక మృతదేహం కనిపించింది.దాంతో విసృతంగా గాలింపు చేపట్టిన వారికి మరెవరూ కనిపించక పోవడంతో బాలిక మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
చనిపోయిన బాలిక వయసు సుమారు 7 ఏళ్ళు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.మిగిలిన ఇద్దరూ మెక్సికో దిశగా వెళ్లి ఉంటారని అంచనాకి వచ్చిన పోలీసులు ఆ దిశగా గాలింపు చేపడుతున్నారు.
అయితే చనిపోయిన బాలిక ఎక్కడి నుంచీ వచ్చింది.మొదటిగా కనపడిన ఇద్దరు మహిళలు ఎక్కడి వారు ఎలా అపహరణకి గురయ్యారు అనే విషయాలని విచారిస్తున్నారు పోలీసులు.







