అమెరికాలోని డబ్లిన్ లో ఉన్న హ్యూస్టన్ రైల్వే స్టేషన్ లో ఓ మహిళ పండంటి పాపకి జన్మని ఇచ్చింది.సినిమాటిక్ గా జిరిగిన ఈ తతంగం అందరిని సంతోషంలో ముచెత్తింది.
మొదట్లో అందరూ కంగారు పడినా పాప పుట్టి , తల్లీ బిడ్డా క్షేమం అని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఆ తరువాత రైల్వే అధికారులు పుట్టిన ఆ బిడ్డకి బంపర్ ఆఫర్ ప్రకటించారు.
ఇంతకీ ఏమిటీ కధ, ఏమిటా ఆఫర్ అనుకుంటున్నారా…వివరాలలోకి వెళ్తే.

గాల్వే నుంచీ డబ్లిన్ వెళ్తున్న ఐర్నాడ్ ఏరీన్న్ ఐరిష్ అనే రైలులో ఈ సంఘటన చోటు చేసుకుంది.రైలు టాయిలెట్ నుంచీ ఓ మహిళ పురిటి నేప్పులతో భాదపటం గమనించిన రైలులో క్యాటరింగ్ చేసే ఏమ్మా టోట్ అనే మహిళ వెంటనే రైల్వే సిబ్బందిని అలెర్ట్ చేసింది.దాంతో ట్రైన్ సంభందిత వ్యక్తులు రైలులో ఎవరైనా డాక్టర్లు ఉన్నారా అంటూ పరిస్థితిని చెప్పడంతో
ఓ డాక్టర్ ఇద్దరు నరుసులు వెంటనే వచ్చి ఆమె ని కిందకిదించి రైల్వే స్టేషన్ లో పురుడు పోశారు.
ఆ తరువాత ఆ పాపని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.తల్లీ బిడ్డా ఇద్దరు క్షేమంగానే ఉన్నారని తెలియడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే రైల్వే అధికారులు తమ స్టేషన్ లో పుట్టిన బుడ్డి పాపకి భారీ ఆఫర్ ప్రకటించారు.ఆ పాపకి 25 సంవత్సరాలు వచ్చే వరకూ కూడా ఫ్రీ గా రైలు ప్రయాణం చేయచ్చని ప్రకటించారు.







