టాలీవుడ్ లో దశాబ్దం క్రితం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్ గా తనదైన హవా సాగిస్తున్న భామ కాజల్ అగర్వాల్.ప్రస్తుతం ఈ భామ సౌత్ లో అనుష్క తర్వాత అంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ జాబితాలో ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ నటించిన సీత సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఈ సినిమా ఆమె కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా నిలిచిపోయింది.
ఇదిలా ఉంటే ఈ భామ తాజాగా తన లవ్ స్టొరీ గురించి చెప్పి హాట్ టాపిక్ గా మారింది.తాను సినిమా రంగంలోకి వచ్చిన ఆరంభంలో ఓ ప్రేమికుడు ఉండేవాడని కాజల్ అగర్వాల్ చెప్పింది.
అయితే అతనితో తప్పని సరి పరిస్థితిలో బ్రేక్ అప్ చెప్పుకోవాల్సి వచ్చిందని.దానికి చాలా కారణాలు ఉన్నాయని అందులో ఒకటి తనకి సినిమా రంగం మీద సరైన అభిప్రాయం లేకపోవడం కూడా ఒకటని కాజల్ చెప్పింది.
అలాగే సినిమాలతో బిజీగా ఉండటం వలన ఎక్కువ సమయం అతనితో గడపలేకపోయానని, అందరి ప్రేమికులి మాదిరి తాము సరదాగా గడిపే సమయం లేకపోవడంతో తప్పని సరి పరిస్థితిలో అతనికి బ్రేక్ అప్ చెప్పాల్సి వచ్చిందని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది.మొత్తానికి ప్రేమలో ఫెయిల్ అయ్యి పదేళ్ళు గడిచిపోయిన కాజల్ ఇంకా తన ప్రేమికుడుని మరిచిపోలేకపోతుంది అని చెప్పడానికి ఆమె మాటలు నిదర్శనం అని టాలీవుడ్ లో ఇప్పుడు చెప్పుకుంటున్నారు.
మొత్తానికి ఏది ఏమైనా అప్పుడు ప్రేమికుడుకి బ్రేక్ అప్ చెప్పడం వలన ఇప్పుడు కాజల్ అగర్వాల్ అనే స్టార్ హీరోయిన్ ని చూడగలుగుతున్నాం లేదంటే ఇలాంటి అందాన్ని ఇండస్ట్రీ మిస్ అయిపోయేది అనేది చెప్పాలి.







