ఏపీ మాజీ స్పీకర్,టీడీపీ సీనియర్ నేత కోడెల శివ ప్రసాద్ పై మరో దెబ్బ పడింది.ఇప్పటికే కొడుకు శివ రామకృష్ణ పై చీటింగ్ కేసు నమోదు కాగా,త్వరలో అరెస్ట్ కు కూడా అంతా సిద్ధం అని వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు తాజాగా ఆయన కుమార్తె విజయలక్ష్మి పై కూడా కేసు నమోదైనట్లు తెలుస్తుంది.రెండేళ్ల క్రితం కేసాను పల్లి లో ఆమె భూకబ్జా కి పాల్పడినట్లు ఒక మహిళ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.అంతేకాకుండా రూ.14 లక్షలు వసూల్ చేసినట్లు కూడా ఫిర్యాదులో ఆ మహిళ పేర్కొనడమే కాకుండా మరో 5 లక్షలు కావాలంటూ డిమాండ్ చేసినట్లు తెలిపింది.ఎకరం భూమిని కబ్జా చేయడానికి నకిలీ డాక్యుమెంట్స్ తో బెదిరింపులకు దిగి డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు ఆ మహిళ ఫిర్యాదు లో పేర్కొనింది.మహిళ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విజయలక్ష్మీతో పాటు అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కోడెల కొడుకు పై కూడా పలు ఆరోపణలు వచ్చాయి.

2014 లో తండ్రి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొడుకు శివరామ కృష్ణ ప్రజలను పట్టి పీడించాడని విమర్శలు ఉన్నాయి.ముఖ్యంగా జీఎస్టీ బదులు కేఎస్టీ కూడా వసూలు చేస్తున్నారని జగన్ పాదయాత్ర చేసిన సమయంలో జనం ఏకరువు పెట్టారు.ఈ క్రమంలో జగన్ అధికారంలోకి రాగానే కోడెల కుటుంబం పై పూర్తి దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.
దీనితో కోడెల కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది.







