అమెజాన్ అధిపతికి చుక్కలు చూపించిన ఇండో అమెరికన్ మహిళ

అమెరికాలో అమెజాన్ అధిపతికి చుక్కలు చూపించింది ఇండో అమెరికన్ మహిళ.ఓ కార్యక్రమ చర్చా వేదికలో ఒక్క సారిగా వేదికపైకి దూసుకు వెళ్ళిన ఆమె అమెజాన్ బాస్ జెఫ్ పై ప్రశ్నల వర్షం కురిపించింది.

 Indian American Activist Interrupts Jeff Bezos On Stage-TeluguStop.com

దాంతో ఒక్క సారిగా షాక్ అయిన ఆయన ఏమి చేయాలో తెలియక మిన్నకుండిపోయాడు.ఇంతకీ ఆమె సంధించిన ప్రశ్న ఏమిటి, ఎందుకు అంతగా ఆమె స్పందించింది అనే వివరాలలోకి వెళ్తే.

రీ మార్స్‌ పేరిట ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ పాల్గొని మాట్లాడుతున్నారు.ఈ కార్యక్రమానికి హాజరయిన జంతు హక్కుల కార్యకర్తగా ఉన్న ఇండో అమెరికన్ యువతి ప్రియా సాహ్నేఆ వేదికపైకి దూసుకు వెళ్ళింది.

స్టేజ్ ఎక్కి మరీ జెఫ్ ని దుమ్ము దులిపేసింది.కార్యక్రమం మధ్యలో ఉండగానే ఆమె ప్రసంగాన్ని అడ్డుకుని ప్రశ్నలు సంధించింది.

అమెజాన్ అధిపతికి చుక్కలు చూప

అమెజాన్ కి అధ్యక్షుడిగా ఉన్న మీరు.జంతువుల కోసం ఏదన్నా చేయాలి కదా అంటూ గట్టిగా ప్రశ్నించింది.మీ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న కోళ్ళ ఫారాల్లో జంతు హింస అత్యంత దారుణంగా జరుగుతోంది.దీనికి మీ సమాధానం ఏమిటి అంటూ పెద్దగా ప్రశ్నించింది.దాంతో అక్కడ అప్పటి వరకూ సరదాగా ఉన్న వాతావరం ఆమె ఎంట్రీ తో ఒక్క సారిగా సైలెంట్ అయ్యింది.వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఆమెని స్టేజి మీద నుంచీ కిందకి దించివేశారు.

అయితే ఆమెని అరెస్ట్ చేశారా లేదా అనేది మాత్రం తెలియరాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube