మాస్కో నుంచి సింఫెరోపోల్ కి వెళ్తున్న విమానంలో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.విమానంలో ఒక్కసారిగా తలెత్తిన గందరగోళ పరిస్థితితో పైలెట్లు విమానాన్ని అత్యవసరంగా మాస్కో ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ చెయ్యాల్సి వచ్చింది.
విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు అకస్మాత్తుగా ఓ యువతి గొంతునులిమి ఆమెని హత్యాయత్నం చేసే ప్రయత్నం చేశాడు.ఆమెను కాపాడే ప్రయత్నం మిగిలిన పాసింజర్స్ చేస్తే బ్రతకాలంటే ఎవరి ప్లేస్ లో వారు కూర్చోవాలని పైలెట్లు నిద్రపోతున్నారని మనమందరం పోతున్నా అంటూ వింత వింత గా కేకలు వేయడం ప్రారంభించాడు.
దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన పాసింజర్లు విమాన సిబ్బంది ఆ వ్యక్తిని బలవంతంగా తన సీటుకి కట్టేశారు.ఇదే సమయంలో ఆ వ్యక్తికి అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో అక్కడ ఉన్నవారు కాస్త టెన్షన్ పడ్డారు.
తప్పనిసరి పరిస్థితుల్లో ఫైలెట్లు అత్యవసరంగా అధికారులకు సమాచారం అందించి వెంటనే మాస్కో ఎయిర్ పోర్ట్ లో ఎమర్జెన్సీగా విమానం ల్యాండ్ చేశారు.ఇక ఎయిర్ పోర్ట్ లో డాక్టర్లు ఆ వ్యక్తిని పరీక్షించగా గుండె నొప్పితో అతను మరణించినట్లు నిర్ధారించారు.
మొత్తానికి చనిపోయే ముందు ఆ వ్యక్తి విమానంలో సృష్టించిన గందరగోళంకి అందరూ కాసేపు టెన్షన్ కి గురి అయ్యారు అని చెప్పాలి
.