మాల్దీవుల పార్లమెంట్ స్పీకర్ గా ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ ఎన్నికైనట్లు తెలుస్తుంది.అక్కడి డెమోక్రటిక్ పార్టీ నషీద్ ని ఏకగ్రీవంగా స్పీకర్ పదవికి ఎన్నిక చేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది.
దీనితో ఒకప్పుడు ఆ దేశ అధ్యక్షుడి గా ఉన్న నషీద్ ఇక స్పీకర్ గా కనిపించనున్నారు.మొత్తం 87 మంది సభ్యుల నుండి నషీద్ 67 ఓట్లను పొందగలగడం తో ఆయన స్పీకర్ గా ఎన్నికయ్యారు.
అయితే ప్రత్యర్థి కి కేవలం 17 ఓట్లు మాత్రమే లభించాయి.దీనితో నషీద్ బుధవారం స్పీకర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
సుప్రీం కోర్టు ను నియమించే జ్యుడిషియల్ సర్వీసెస్ కమీషన్ లో కూడా స్పీకర్ పాత్రను కలిగి ఉంటారు.

మాల్దీవులు అధ్యక్షుడిగా 2008-2012 కాలంలో నషీద్ పదవిలో కొనసాగారు.ఆ దేశ చరిత్రలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన మొదటి అధ్యక్షుడు గా కూడా మహ్మద్ నషీద్ నిలిచారు.కానీ తీవ్రవాద ఆరోపణల నేపథ్యంలో ఆయన 13 ఏళ్ల జైలు శిక్ష కూడా అనుభవించారు.
అయితే ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విపక్షనేత డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ నల్హీ అఖండ విజయం సాధించారు.దీంతో కొత్తగా స్వీకర్‌ను ఎన్నుకోవల్సిరావడం తో నషీద్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలుస్తుంది.
.






