సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీలు అన్ని కూడా ఇప్పుడు అసలు తప్పు ఎక్కడ జరిగింది అనే విశ్లేషణ లో పడ్డాయి.ఇటు ఏపీ లో టీడీపీ పార్టీ గాని, అటు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గానీ అసలు తప్పిదం ఎక్కడ జరిగింది అంటూ విశ్లేషించుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో తమ ఓటమి పై విశ్లేషించడానికి కాంగ్రెస్ పార్టీ ఈ నెల 25 న అంతర్గత సమావేశం నిర్వహించింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారట.
ఎవరికీ వారు వారి ప్రయోజనాలే చూసుకున్నారని,పార్టీ గురించి ఎవరూ పట్టించుకోలేదంటూ సీనియర్ నేతల పై రాహుల్ మండిపడినట్లు తెలుస్తుంది.

ఈ సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ ….పార్టీ ఓటమికి తాను బాధ్యత తీసుకుంటున్నట్లు చెప్పిన ఆయన పార్టీ సీనియర్ నేతల బాధ్యత కూడా ఉందని ఆరోపించినట్లు సమాచారం.వారసుల ఎదుగుదలే ముఖ్యమని భావించిన కొందరు సీనియర్ నేతల ధోరణిని పై రాహుల్ ఎండగట్టినట్లు తెలుస్తుంది.
ముఖ్యంగా మాజీ కేంద్రమంత్రి చిదంబరం.రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులను ఉద్దేశించి రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.







